TDP Kadapa in-charge టీడీపీ కడప నియోజకవర్గ ఇన్ ఛార్జిగా రెడ్డప్పగారి మాధవీరెడ్డి.. ! - TDP state president Achchennaidu
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-09-2023/640-480-19460741-thumbnail-16x9-tdp-kadapa-in-charge.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 8, 2023, 3:44 PM IST
TDP Kadapa in-charge : తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ ఇన్ ఛార్జిగా రెడ్డప్పగారి మాధవీరెడ్డిని పార్టీ అధిష్ఠానం నియమించింది. ఇంతవరకు ఇన్ ఛార్జిగా ఉన్న అమీర్ బాబును తప్పించి... వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మాధవికి పార్టీ బాధ్యతలు అప్పగించింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, కడప పార్లమెంటు టీడీపీ అభ్యర్థి (TDP candidate) రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి సతీమణే మాధవీరెడ్డి. ఇవాళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Achchennaidu) నుంచి కడప ఇన్ ఛార్జిగా అధికారిక ఉత్తర్వులు రావడంతో పాటు... ఈరోజే శ్రీనివాసులరెడ్డి పుట్టినరోజు కావడంతో వారి ఇంట సంబరాలు చేసుకున్నారు.
పార్టీ కార్యకర్తలు భారీ కేక్ కట్ చేసి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. కడప నియోజకవర్గ (Kadapa Constituency) బాధ్యతలు తనకు అప్పగించిన పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మాధవి అన్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో ఉన్న పార్టీ సీనియర్లు, యువతను అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానన్నారు. పార్టీ గెలుపు, నియోజకవర్గ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పని చేస్తానని మాధవీ రెడ్డి తెలిపారు.