TDP Jayaram On CBN Arrest: 'చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ తెచ్చారు' - సీఎం జగన్పై టీడీపీ నేతలు ఫైర్ న్యూస్
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 25, 2023, 10:37 AM IST
TDP Jayaram On CBN Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేసి ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ తెచ్చారని ఆ పార్టీ ఎన్ఆర్ఐ నేత కోమటి జయరాం ధ్వజమెత్తారు. తెలుగువారు గర్వపడేలా చేసిన చంద్రబాబు ఖ్యాతిని.. దిగజార్చాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఒకప్పుడు అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో 100 తెలుగు కుటుంబాలుండేవని.. చంద్రబాబు చలువతో ఆ సంఖ్య లక్షకు చేరిందన్నారు. ప్రవాసాంధ్రులందరూ చంద్రబాబుకు అండగా ఉంటారని స్పష్టం చేశారు.
"టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ తెచ్చారు. తెలుగువారు గర్వపడేలా చేసిన చంద్రబాబు ఖ్యాతిని దిగజార్చాలని ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో 100 తెలుగు కుటుంబాలుండేవని.. చంద్రబాబు చలువతో ఆ సంఖ్య లక్షకు చేరింది. ప్రవాసాంధ్రులందరూ చంద్రబాబుకు అండగా ఉంటారు." - కోమటి జయరాం, టీడీపీ ఎన్ఆర్ఐ నేత