TDP Fans Welcome Nara Lokesh with a Fish Garland: అభిమానుల ఘన స్వాగతం.. నారా లోకేశ్‌కు చేపల గజమాల - లోకేశ్ ట్రెండింగ్ వీడియోలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 3, 2023, 10:56 PM IST
TDP Fans Welcome Nara Lokesh with a Fish Garland: యువగళం పాదయాత్ర ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకూ.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై టీడీపీ కార్యకర్తలు, నాయకులు తమ అభిమానాన్ని చాటుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పాదయాత్ర ప్రవేశించిన ప్రతిచోట ఆయా... టీడీపీ అభిమానులు తమ ప్రాంతానికి చెందిన సాంప్రదాయాల ప్రకారం వినుత్నంగా స్వాగతం పలుకుతూ లోకేశ్‌పై ఉన్న అభిమానాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. భారీ గజమాలలతో, వివిధ రకాలైన పూలు, పండ్లు, తదితర రూపాల్లో స్వాగతం పలుకుతూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు లోకేశ్‌ను వినూత్నంగా స్వాగతించి తమ ఆభిమానాన్ని చాటుకున్నారు. పాదయాత్రలో ఏకంగా చేపలతో తయారు చేసిన భారీ గజమాలను లోకేశ్ మెడలో అలంకరించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌కు తెలుగుదేశం శ్రేణులు చేపలతో తయారు చేసిన గజమాలతో ఘన స్వాగతం పలకడంతో నారా లోకేశ్ ఆశ్చర్యపోయారు.