TDP Fan Different Protest in Narasaraopet: మోకాళ్లపై కోర్టుకు.. నరసరావుపేటలో టీడీపీ అభిమాని వినూత్న నిరసన - నరసరావుపేట లోకల్ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 2, 2023, 2:59 PM IST

Updated : Oct 2, 2023, 3:07 PM IST

TDP Fan Different Protest in Narasaraopet: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టును ఖండిస్తూ పల్నాడు జిల్లా నరసరావుపేటలో మందాడి రవి అనే ఓ టీడీపీ అభిమాని వినూత్నంగా నిరసన తెలిపాడు. పట్టణంలోని కోట సెంటర్​లో గల కోడెల కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు  అర్పించిన రవి.. ఆనంతరం అక్కడి నుంచి న్యాయస్థానం వరకు మోకాళ్లపై నడిచి వెళ్లి కోర్టు ప్రాంగణంలోని న్యాయదేవతకు వినతిపత్రం అందజేశారు. చంద్రబాబు నాయుడి అరెస్ట్​ అక్రమం అని ఆయన మండిపడ్డారు. వైఎస్సార్​ కాంగ్రెస్​ ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించి.. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని న్యాయదేవతను వేడుకున్నట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడి పై​ వైఎస్సార్​ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల నుంచి చంద్రబాబు త్వరగా బయటపడి.. కడిగిన ముత్యంలా బయటకు వస్తారని మందాడి రవి ఆశాభావం వ్యక్తం చేశారు.

Last Updated : Oct 2, 2023, 3:07 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.