Devineni Uma on Polavaram: 'బస్సులు పెట్టి.. మీ నాయకులను పోలవరం తీసుకెళ్లే దమ్ముందా జగన్' - మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
🎬 Watch Now: Feature Video
TDP Devineni Uma Fires on CM Jagan: వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులను మీడియా సమక్షంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సులు పెట్టి పోలవరం డ్యామ్ సైట్లోకి తీసుకెళ్లే దమ్ము జగన్ రెడ్డికి ఉందా అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సవాల్ విసిరారు. జులైలో గోదావరికి వరద వచ్చేలోపు 1000 కోట్ల రూపాయలు నొక్కేయటానికి ముఖ్యమంత్రి తమను పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లనివ్వలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 1500 కోట్ల బిల్లులో పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఎంపీ మిథున్ రెడ్డిది 600 కోట్లని.. పీఎల్ఆర్ రాఘవ జాయింట్ వెంచర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సొంత మనిషని ఆరోపించారు. 150 కోట్లకు కక్కుర్తిపడి చిన్న చిన్న ఏజెన్సీలను నాశనం చేసి సీఎఫ్ఎంఎస్ తుంగలో తొక్కి దోపిడీ కార్యక్రమం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. న్యాయస్థానం, న్యాయవాదులపై రిక్కీ నిర్వహించే స్థాయికి వచ్చారంటే పోలీసులు.. వైసీపీ నాయకులు ఏవిధంగా ములాఖత్ అయ్యారో అర్థమవుతుందని విమర్శించారు. జగన్ రెడ్డి దొంగ ఓట్లు చేర్చడం, 50 కోట్ల అవినీతి సొమ్మును ఒక్కో నియోజకవర్గానికి డంప్ చేయడాన్ని నమ్ముకున్నాడని దుయ్యబట్టారు. దోచుకున్న డబ్బులో 2 వేల నోట్లను లిక్కర్ షాప్లో రోజూ మార్చుతున్నారని ఆరోపించారు.