TDP Activists Protest in Srikakulam: శ్రీకాకుళంలో టీడీపీ నిరసన.. అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 12, 2023, 10:53 PM IST

thumbnail

TDP activists stage protests in Srikakulam: చంద్రబాబు అరెస్ట్​కు వ్యతిరేకంగా శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తమ అధినేతను అక్రమంగా అరెస్టు చేశారంటూ... తెలుగుదేశం పార్టీ శ్రేణులు నల్ల జెండాలతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదాలు, తోపులాటలతో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ నేపథ్యంలో పోలీసులు శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్, ఎమ్మెల్యే బెందాళం అశోక్​తో పాటు కార్యకర్తలను అరెస్టు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్​కు తరలించారు. టీడీపీ నేతలను అరెస్ట్​ చేయడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసన తెలుపుతుంటే.. పోలీసులు కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ మెప్పు పొందడం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.