జగనన్నా ఏదీ జాబ్ క్యాలెండర్? - నెల్లూరులో విద్యార్థుల వినూత్న నిరసన - నెల్లూరులో వినూత్న నిరసన
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 21, 2023, 3:14 PM IST
Students Protest For Job Calendar: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ సర్కారు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంలేదని నెల్లూరులో విద్యార్థులు వినూత్న నిరసన చేపట్టారు. భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో విద్యార్థి ఉరివేసుకున్న ఫొటోకు శవయాత్ర చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంలో నాలుగున్నర ఏళ్లుగా రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని యువ మోర్చా నేతలు, విద్యార్థులు విమర్శించారు. అధికారంలోకి వస్తే లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తానన్న సీఎం జగన్ ఇచ్చిన హామీ మరిచి యువతను మోసం చేశారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
"సీఎం జగన్ పాదయాత్రలో భాగంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లవుతున్నా ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. ఇకపై సీఎం జగన్ పుట్టిన రోజును తీసేసి ఈ రోజును జాబ్ క్యాలెండర్ వర్ధంతిగా జరుపుకోవాలని నిర్ణయించుకుంటున్నాం. మాకు జాబ్ క్యాలెండర్ను విడుదల చేసిన తర్వాతే సీఎం జగన్ జన్మదిన వేడుకలు జరుపుకోవాలని డిమాండ్ చేస్తున్నాం." -అశోక్ నాయుడు, భారతీయ జనతా యువమోర్చా నేత