ప్రధానోపాధ్యాయురాలి వైఖరిని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన - అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని మండిపాటు - Mudinepalli rally against HM
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 14, 2023, 9:59 PM IST
Students Against to HM in Eluru District : పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి వైఖరిని నిరసిస్తూ విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగిన ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ముదినేపల్లి మండలం పెద్ద పాలపర్రులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది. అక్కడ ప్రధానోపాధ్యాయురాలుగా శాంత కుమారి విధులు నిర్వహిస్తున్నారు. ఈమె కొన్ని రోజులుగా అసభ్య పదజాలంతో తమను తీవ్రంగా దూషిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. ఈమేరకు పాఠశాల ఎదురుగా జాతీయ రహదారిపై తల్లిదండ్రులతో కలిసి ప్రధానోపాధ్యాయులిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి నగేష్ కు వినతి పత్రం అందించారు. ఈ విషయం ఉన్నత అధికారుల వద్దకు తీసుకెళ్తమని ఆయన తెలిపారు.
తము ఏది మాట్లడిన కోపగించుకుంటుందని విద్యార్థులు వాపోయారు. మిగత ఉపధ్యాయులకి కానీసం గౌరవం కూడా ఇవ్వకుండా వారిని ఇష్టం వచ్చినట్టు తిడుతుందని తెలిపారు. ఇంత వరకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదని తల్లిదండ్రులు మండిపడ్డారు. అధికారులు ప్రధానోపాధ్యాయురాలిపై తగిన చర్యలు తీసుకొని, ఆమెను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు.