Stage Collapsed: బత్తులవారిగూడెంలో కుప్పకూలిన స్టేజి​.. కిందపడ్డ టీడీపీ నేతలు - నేటి తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 23, 2023, 8:18 PM IST

Updated : Jun 23, 2023, 8:38 PM IST

TDP Stage Incident: ఏలూరు జిల్లా నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వల్ప ప్రమాదం జరిగింది. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో సమావేశం నిర్వహించారు. దీనికి పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రసంగిస్తుండగా.. బలంగా వీసిన గాలులకు వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో తెదేపా సీనియర్‌ నేతలు చింతమనేని ప్రభాకర్‌, చినరాజప్ప తదితరులు స్టేజిపై నుంచి కిందపడ్డారు. అప్రమత్తమైన కార్యకర్తలు.. నాయకులను పైకి లేపారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. 

ఒక్కసారిగా వేదిక కూలడంతో నేతల మోకాళ్లు కింద గుద్దుకుని పడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో భీమడోలు మాజీ ఏఎంసీ చైర్మన్ పుల్లయ్య నాయుడికి గాయాలయ్యాయి.. కుట్లు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగే సమయానికి వేదికపై తెదేపా నాయకులు పితాని, పీతల, చింతమనేని, ముద్దరబోయిన, గన్ని వీరాంజనేయులు, బడేటి చంటి, మాగంటి బాబులు ఉన్నారు. ఈ సమయంలో వేదికపై దాదాపు 40మంది తెదేపా ముఖ్య నాయకులున్నట్లు తెలుస్తోంది. 

Last Updated : Jun 23, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.