శ్రీశైలంలో ఘనంగా గిరిప్రదక్షిణ - ఆలయ అభివృద్ధికి ₹215 కోట్లు - kottu satyanarayana srisailam development works
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 27, 2023, 1:07 PM IST
Srisailam Giri Pradakshina: శ్రీశైల మహా క్షేత్రంలో పౌర్ణమిని పురస్కరించుకొని గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు విశేష పూజలు నిర్వహించి, అనంతరం ప్రచార రథంపై కొలువుదీర్చారు. మంగళ వాయిద్యాలు ,వేద మంత్రోచ్ఛరణలతో గిరిప్రదక్షిణ నిర్వహించారు. తరువాత ఆలయ ప్రాంగణంలో శ్రీభ్రమరాంబా దేవికి లక్ష కుంకుమార్చన పూజ చేశారు.
Development Works in Srisailam cost of Rs.215 Crores by Endowment Minister: శ్రీశైల మహాక్షేత్రంలో రూ.215 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చేతుల మీదుగా బుధవారం ఉదయం శంకుస్థాపన చేయనున్నట్లు దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు తెలిపారు. రూ.75 కోట్లతో నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మాణం, రూ.35 కోట్లతో సాలు మండపాలు, శివం రోడ్డు సుందరీకరణ, రూ.52 కోట్లతో 200 వసతి గదుల సముదాయం, రూ.7 కోట్లతో సౌర విద్యుత్తు ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు సీసీ రోడ్లు, నీళ్ల ట్యాంకులు, ఉపకేంద్రం, దోర్నాల సత్రం వద్ద కల్యాణ మండపం, దుకాణ సముదాయాల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు ఈవో వెల్లడించారు. నూతన క్యూ కాంప్లెక్స్, సాలు మండపాల నిర్మాణాలకు సంబంధించిన నమూనాలను దేవస్థానం అధికారులు విడుదల చేశారు.