'ఒక్కడే ఒంటరిగా 33 రోజులు, లక్ష మంది' : కోటంరెడ్డి ఏం కోరారంటే! - నెల్లూరు రాజకీయ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2023, 4:02 PM IST

Sridhar Reddy Spoke to One Lakh People Alone for 33 Days : నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 'ఒక్కడే 33 రోజుల పాటు ఒంటరిగా లక్ష మందితో మాటామంతి' అనే కార్యక్రమం.. ఈ నెల 25న (నవంబరు 25) ఫతేఖాన్ పేట నుంచి ప్రారంభిస్తున్నట్లు విలేరుల సమావేశంలో శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.

కార్యక్రమానికి సంఘీభావంగా.. తన కుటుంబ సభ్యులు పాల్గొంటారని శ్రీధర్ రెడ్డి తెలిపారు. తన సతీమణి సుజిత అదే రోజున.. ఉప్పుటూరు గ్రామం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటుందన్నారు. తన ఇద్దరు కుమారైలు.. హైందవి, వైష్ణవి కొండూరుపాడు, దొంతాళి నుంచి ప్రారంభిస్తారని తెలియజేశారు. ఇందుకు పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఎలాంటి ఫ్లెక్సీలను కట్టవద్దని కోటంరెడ్డి కోరారు. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సాగే ఈ కార్యక్రమానికి.. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యుల సహకారంతో చేస్తున్నా ఈ కార్యక్రమానికి... నియోజకవర్గ ప్రజలందరూ దీవించాలని కోరుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.