SP Malika Garg on Land Scam Case: నకిలీ స్టాంప్‌ల కేసు సిట్ ద్వారానే దర్యాప్తు జరుగుతోంది.. సీఐడీ ప్రస్తావన లేదు: ఎస్పీ మలికాగార్గ్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 21, 2023, 7:05 PM IST
SP Malika Garg on Land Scam Case ప్రకాశం జిల్లా ఒంగోలులో సంచలనం సృష్టించిన నకిలీ స్టాంపులు కేసులో ఎస్పీ మలికా గార్గ్ స్పందించారు. ఈ కేసులో సిట్ ద్వారానే ధర్యాప్తు నిర్వహిస్తున్నామని.. సీఐడీ దర్యాప్తు ప్రస్తావన లేదని తెలిపారు. ఈ భూకుంభకోణంలో వచ్చిన ఫిర్యాదుల నేపధ్యంలో సిట్ ఏర్పాటు చేసి.. ధర్యాప్తు చేయడంతో నకిలీ స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్ల వ్యవహారం బయటపడిందని అన్నారు. వీటిపై అనేక పత్రాలు పరిశీలించామని వాటికి అనుబంధంగా ఉన్న పత్రాలు, లావాదేవీలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉందని ఎస్పీ తెలిపారు. కేసులో జాప్యం జరగుతుందని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపణలపై ఎస్పీ స్పందించారు. ఇది సమాచార లోపమని.. ఈ కేసులో అన్ని పత్రాలను నిశితంగా పరిశీలించాలని.. ఇందులో ఏది నకిలీ, ఏది నిజం అనే విషయాన్ని అన్ని కోణాల్లో ధర్యాప్తు చేస్తేగానీ తెలియదని స్పష్టం చేశారు. తొంతరపాటుతో వ్యవహరిస్తే జరగకూడని తప్పులు జరగొచ్చు.. అందువల్ల లోతుగా దర్యాప్తు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేశామని ఇంకా కొంతమందిని నిందుతులుగా గుర్తించామని ఎస్పీ పేర్కొన్నారు.