thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2023, 7:33 PM IST

ETV Bharat / Videos

'ఏ తండ్రికీ ఇలాంటి కష్టం రాకూడదు' - కొడుకు మోసంపై ఆవేదన

Son Cheated Father  in Nandhyala: కన్నకొడుకే మోసం చేసి ఆస్తిని కాజేశాడంటూ ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం నంద్యాల జిల్లా డోన్‌లో టీచర్స్ కాలనీకి చెందిన గంగిరెడ్డికి నలుగురు సంతానం. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. నలుగురికీ వివాహం చేశాడు. ఆయన పెద్ద కుమారుడు రవిశంకర్ రెడ్డి తన ఇంటికి తప్పుడు పత్రాలు సృష్టించి, బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.20 లక్షలు రుణం తీసుకుని, ఇళ్లు కట్టుకున్నాడని గంగిరెడ్డి తెలిపారు.

Son Fraud Expressing Through Pamphlets: ఇది సరిపోక తాను ఉంటున్న ఇళ్లు కూడా కావాలని ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారని బాధితుడు తెిలిపారు. అయినా ఇల్లు ఖాళీ చేయకపోవటంతో తన ఇంట్లో మారణాయుధాలు, తుపాకులు ఉన్నాయని పోలీసులకు తప్పుడు సమాచారం ఇవ్వటంతో పోలీసులు తన ఇంట్లో సోదాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు ఖాళీ చేసేంతవరకూ విడిచి పెట్టనని, తనను చంపి అయినా  స్వాధీనం చేసుకుంటానని కుమారుడు బెదిరించాడని బాధితుడు తెలిపారు. ఈ సమస్య గురించి ఆర్డీవో(RDO), డీఎస్పీ(DSP)కి చెప్పినప్పటికీ తనకు న్యాయం జరగలేదని బాధితుడు వాపోయారు. 

తన కష్టార్జితంతో సంపాదించుకున్న ఇంటిని ఖాళీ చేయమని బెదిరిస్తున్నాడని, ఏ సమయంలో ఎం జరుగుతుందో అని అనుక్షణం భయపడుతున్నామని బాధితుడు కంటతడి పెట్టుకున్నారు. ఏ తండ్రికి ఇలాంటి కష్టం రాకూడదని, అధికారులు తమకు న్యాయం చేసేలా చూడాలని బాధితుడు కోరుతున్నారు. పట్టణంలోని పోలీస్​స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, బస్టాండ్‌ వద్దకు వచ్చిన వారికి కరపత్రాలు పంపిణీ చేసి కొడుకు చేసిన మోసాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.