Somu Veerraju: 'హిందువుల మనోభావాలను వైసీపీ దెబ్బ తీస్తోంది' - name of AT Agraharam in guntur changed as
🎬 Watch Now: Feature Video
Somu Veerraju on Changing the Name of AT Agraharam: హిందువుల మనోభావాలను దెబ్బ తీయాలని వైసీపీ పనిగా పెట్టుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. గుంటూరులోని ఏటీ అగ్రహారం వీధికి ఫాతిమానగర్‌గా పేరు మార్చటాన్ని తప్పుపట్టారు. పేరు మార్చడంలో ప్రభుత్వం ఉద్దేశం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మత రాజకీయాలు, ఓట్ల రాజకీయాలు బాగా ఎక్కువయ్యాయని సోము వీర్రాజు అన్నారు. ఈ మధ్యకాలంలో విశాఖ నగరంలో సీత కొండ పేరును వైఎస్ వ్యూ పాయింట్‌గా మార్చడం, ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహం పెట్టాలని ప్రయత్నం చేయడం.. ఈ తరహా చర్యలకు ఎవరు సూత్రధారని నిలదీశారు. ముస్లింల కోసం చట్టాలు మారుస్తామని ప్రకటిస్తున్నారని అన్నారు.
హిందూ ఎస్సీలకు వ్యతిరేకంగా ప్రభుత్వ పోకడలు చూస్తే హిందువులపై దాడులకు తెగబడే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందని సోము వీర్రాజు విమర్శించారు. నగరంలోని ఏటీ అగ్రహారం రెండు వీధులకు ఫాతిమానగర్‌గా పేరు మారుస్తూ కార్పొరేషన్ అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. పేరు మార్పును వ్యతిరేకించిన స్థానికులు కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డును తొలగించి ఏటీ అగ్రహారం అని రాశారు.