స్మార్ట్ మీటర్లు వద్దు, పాత మీటర్లే ముద్దు - రైతు సంఘాల మహాధర్నా - Prime Minister Crop Insurance Scheme
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 28, 2023, 2:23 PM IST
Smart Meters Not Accept Farmers To Mahadarna In Vijayawada: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మెప్పు కోసమే రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని ఏపీ కార్మిక-కర్షక, ప్రజాసంఘాలు ధ్వజమెత్తాయి. భాజపా రాష్ట్రాలు సైతం స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తుంటే జగన్ మాత్రం నెత్తిన పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. విజయవాడ జింఖానా మైదానంలో నిర్వహించిన మహాధర్నాకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు, కార్మికులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఈ సభకు అధ్యక్షత వహించనున్నారు. రెండురోజుల పాటు కర్షక-కార్మిక మహాధర్నా జరగనుంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై ప్రజలు పోరాడాలని రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపునిచ్చింది. పంటలన్నింటికీ కనీస మద్దతు ధర నిర్ణయించి చట్టబద్ధత కల్పించాలన్నారు
రైతులకు ఉరితాడుగా మారిన విద్యుత్ బిల్లును ఉపసంహరించాలని, వ్యవసాయ మోటార్లకు ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించవద్దని మహాధర్నాలో తీర్మానించారు. కౌలురైతులతో సహా రైతులందరికీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్(Scale Of Finance) కింద రుణాలు అందివ్వాలన్నారు. కార్పొరేట్ అనుకూల ప్రధానమంత్రి పంటల బీమా పథకం(Prime Minister's Crop Insurance Scheme) ఉపసంహరించాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మికుల హక్కుల్ని పునరుద్ధరించాలన్నారు. నూతన ఫెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని పేర్కొన్నారు. కనీస వేతనంగా 26వేలు అమలు చేయాలని సదస్సులో రైతు, కార్మిక, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.