Six Snakes Caught in One Day: పాడేరులో పాముల కలకలం..ఒకేరోజు ఆరు పాములను పట్టుకున్న స్నేక్ క్యాచర్

By

Published : Jun 29, 2023, 2:21 PM IST

Updated : Jun 29, 2023, 2:47 PM IST

thumbnail

Six Snakes Caught in One Day at Paderu : రాష్ట్రంలో వాతావరణం మార్పులు.. వర్షాకాలం ప్రారంభం కావడంతో పాములు బయటకు వస్తున్నాయి. జనావాసాల్లో సంచరిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒకే రోజు ఆరు పాములను స్నేక్  క్యాచర్ చాకచక్యంగా పట్టుకున్నారు. దీంతో స్థానికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.  

అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో పలు వీధుల్లో పాములు హల్​చల్​ చేశాయి. ఇటీవల వర్షాలు పడటంతో పాములు బయటకు వచ్చి స్థానికులను ఆందోళనకు గురి చేశాయి. పాడేరు పీఎంఆర్​సీ సమీపంలో ఓ చెట్టుపై కాకి గూటిలో ఉన్న పిల్లలను పాము తినడంతో స్థానికులు స్నేక్ క్యాచర్ భాస్కర్​కు సమాచారం అందించారు. తక్షణమే స్నేక్ క్యాచర్ చెట్టెక్కి పాముని చాకచక్యంగా బంధించాడు. పాడేరు ప్రథమ శ్రేణి జ్యుడిషియల్ కోర్టులో, సెయింటెన్స్ స్కూల్ ఎదురుగా ఓ ఇంట్లో, గడ్డి కాలనీలో మరో ఇంట్లో, బైక్​లో ఇలా వివిధ ప్రాంతాల్లో ఆరు పాములు కలకలం సృష్టించాయి. స్నేక్ క్యాచర్ భాస్కర్​ అన్ని పాములను పట్టుకున్నారు. ఇలా ఒకే రోజు ఆరు సర్పాలను స్నేక్ క్యాచరు పట్టుకుని పాడేరు శివారు కొండల్లో విడిచిపెట్టాడు. 

పాములు కనిపిస్తే తమకు సమాచారం అందించాలని భాస్కర్ తెలిపారు. వర్షాలకు బయటకు వస్తున్నాయని ఎవరు హాని తలపెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ వర్షాకాలంలో పల్లె ప్రాంతాల్లో రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ పాముల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు.

Last Updated : Jun 29, 2023, 2:47 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.