40వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సెక్షన్ అధికారి - ఎన్టీఆర్ జిల్లా ముఖ్యమైన వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 24, 2023, 3:31 PM IST
Section Officer Caught by ACB Officers: రాష్ట్ర సచివాలయంలో సెక్షన్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న నాగభూషణ్ రెడ్డి లంచం తీసుకుంటూ.. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సచివాలయంలోని పార్కింగ్ ప్రాంతంలో ఓ బాధితుడి నుంచి 40 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Case Registered Section Officer Nagabhushan Reddy: రాష్ట్ర సచివాలయంలోని ఆర్ధిక శాఖలో నాగభూషణ్ రెడ్డి అనే వ్యక్తి సెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మైనారిటీ వెల్పేర్ విభాగంలో విదేశీ విద్యకు సంబంధించి, ఆర్ధిక సాయం అందేందుకు గానూ.. కర్నూలు జిల్లాకు చెందిన మహ్మద్ నదీమ్ హుస్సేన్ అనే వ్యక్తి నుంచి 40 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. దాంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు.. సచివాలయంలోని రెండో బ్లాక్ సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో లంచం తీసుకుంటుండగా నాగభూషణ్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి, నిందితుడిని కోర్టులో హాజరు పర్చనున్నట్టు అధికారులు వెల్లడించారు.