అంతరాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద 220 కేజీల గంజాయి స్వాధీనం - Ganja in Jangareddygudem
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 28, 2023, 4:53 PM IST
SEB Officials Seize 220 KG Ganja : రాష్ట్రంలో గంజాయి రవాణా నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. పోలీసుల ఉక్కుపాదం మోపుతున్నా ఎక్కడో ఒక చోట గంజాయి వాసన గుప్పుమంటోంది. తాజాగా ఏలూరు జిల్లాలో అంతరాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద లారీలో గంజాయి తరలిస్తున్న ఇద్దరిని ఎస్ఈబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే, జిల్లాలోని జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద ఎస్ఈబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో లారీలో 220 కేజీల గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ విషయంపై జంగారెడ్డిగూడెంలో ఏఎస్పీ సూర్యచంద్రరావు మీడియా సమావేశం నిర్వహించారు. అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు లారీలో 110 బ్యాగుల్లో 220 కేజీల గంజాయిని తరలిస్తూ పట్టుబట్టారని ఆయన తెలిపారు. 110 బ్యాగులను లారీ క్యాబిన్లో అమర్చి మహారాష్ట్రలోని అహ్మదాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 22 లక్షలు రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని, దర్యాప్తు ప్రారంభించామని ఏఎస్పీ సూర్యచంద్రరావు తెలిపారు.