అధ్వానంగా తయారైన రహదారి - సొంత నిధులతో మరమ్మతులు చేపట్టిన సర్పంచ్ - ఏపీలో రోడ్ల పరిస్థితి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-12-2023/640-480-20168633-thumbnail-16x9-sarpanch-repaired-road.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 2, 2023, 9:28 PM IST
sarpanch and Farmers Repaired Road with their Own Funds: గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా తయారు కావటంతో చేసేదేమీలేక ఓ సర్పంచ్ మరో రైతు కలిసి తమ సొంత నిధులతో రోడ్డు మరమ్మతులు చేసేందుకు ముందుకు వచ్చారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం భట్టు వానిపల్లి- దర్గకుంట గ్రామాల మధ్య రోడ్డు పూర్తిగా పాడైపోయింది. గుంతలు పడి అధ్వానంగా తయారైంది. రెండు గ్రామల మధ్య రాకపోకలకు స్థానికులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వానికి, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు. ప్రభుత్వ అధికారుల నర్లక్ష్యంతో తమ రోడ్డును తామే బాగుచేసుకోవాలని సర్పంచ్ అరుణ నిర్ణయించారు. మరో రైతు సహకారంతో మరమ్మతు పనులు ప్రారంభించారు. గుంతలు పడ్డ రోడ్డుపై మట్టి పోసి చదును చేశారు. రోడ్డు పక్కన అడ్డదిడ్డంగా పెరిగిన ముళ్ల పొదళ్లను జేసీబీతో కొట్టించారు. సర్పంచ్ చర్యలపై ఆ రోడ్డు వెంట ప్రయాణించే ప్రయాణికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.