Mobile Hospital: పల్లె ప్రజల కోసం.. సంచార వైద్య వాహనం.. ప్రారంభించిన చంద్రబాబు - Mobile medical vehicle in Nellore district

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 21, 2023, 11:34 AM IST

గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం అందుబాటులో తీసుకు వచ్చేందుకు ఓ ప్రవాసాంధ్రుడు సంచార వైద్య వాహనాన్ని ప్రారంభించారు.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేతులమీదుగా ఈ వాహనాన్ని ప్రజలకు అంకితం చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వెనుకబడిన గ్రామాలకు నిత్యం వైద్య సేవలు అందించేందుకు ప్రవాసాంధుడు కాకర్ల సురేష్ ఓ కార్యక్రమాన్ని రూపొందించారు. సంచార వైద్యశాలలో సుమారు 200 రకాల పరీక్షలు నిర్వహించే విధంగా.. అనేక రోగాలకు వైద్యం అందించే విధంగా సంజీవిని పేరుతో వైద్యశాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు గ్రామంలో తిరుగుతూ అక్కడ ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్సలు , మందులు అందించేందుకు ఈ కార్యక్రమం ప్రారంభించారు. 

ప్రకాశం జిల్లా మార్కాపురంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా దీన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలో 8 మండలాల్లో ఈ సేవలను అందించనున్నారు. ఈ బస్సులో ఒక వైద్యుడు, సిబ్బంది గ్రామాల్లో తిరుగుతూ వైద్య సేవలు అందించనున్నారు. కార్పొరేట్ హాస్పిటల్​ తరహాలో పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేశారు.. యువ నేత లోకేష్ బాబు స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రవాసాంధ్రుడు సురేష్ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.