Sanitation Workers Protest in Madasikara: మడకశిరలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన.. కార్యాలయానికి తాళం - మడకశిరలో పారిశుద్ధ్య కార్మికుల నిరసన
🎬 Watch Now: Feature Video
Municipal Wokers Protest In Madakasira: శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర మున్సిపల్ కార్యాలయంలో పని చేసే పారిశుద్ధ్య కార్మికులు.. తమ సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మడకశిర మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి.. ఆఫీస్‌కు తాళం వేశారు. ఆనంతరం కార్యాలయం ఎదుట బైఠాయించిన కార్మికులు.. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి వారి నిరసనను తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారికి వినతి పత్రం అందించారు. చాలా కాలంగా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్‌లో పని చేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.. కార్మికులకు పనికి తగిన వేతనం ఇవ్వాలని కోరారు. రక్షణ పరికరాలు, భద్రత సౌకర్యాలను సకాలంలో అందించాలని జగన్ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా అదే మున్సిపల్ ఆఫీస్‌లో పని చేస్తున్న కార్మికుల జీతాలను పెంచాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ కార్మికులకు జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.