Simhachalam: ఆ ఒక్క రోజే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం.. 125 కిలోల చందనం - సింహాద్రి అప్పన్న సన్నిధిలో చందనోత్సవం
🎬 Watch Now: Feature Video
విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా స్వామి వారి సన్నిధిలో చందనం అరగతీత ప్రారంభించారు. ఈ నెల 23న జరగనున్న నిజరూప దర్శనంలో భాగంగా నేడు చందనం అరగదీశారు. మూడు రోజులపాటు 125 కేజీలు చందనాన్ని అరగదీస్తారు. ఈ నెల 23వ తేదీన చందనోత్సవం పురస్కరించుకుని స్వామివారికి చందనం ఒలిచిన అనంతరం సహస్ర ఘట్టాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం ఈ 125 కేజీల చందనాన్ని స్వామి వారికి సమర్పిస్తారు. స్వామివారి ఉత్సవాల్లో ప్రధానమైనది ఈ చందనోత్సవం.. 364 రోజులపాటు స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.. అక్షర తృతీయ చందనోత్సవం నాడు నిజరూప దర్శనం భక్తులకు కలగజేస్తారు. సంవత్సరంలో ఒక్క మారే ఈ దర్శనం కావడంతో భక్తులు దేశ నలుమూలల నుంచి తరలి వస్తుంటారు. దీనిలో భాగంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అన్ని శాఖల సమయంతో ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తామని ఇప్పటికే ఆలయ ఈవో, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ తెలిపారు. నేడు స్వామివారికి సుప్రభాత సేవతో మేలుకొలుపు, విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసాచార్యులు తొలి చందనం చెక్కను గర్భాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం అరగదీశారు. ఈ మూడు రోజులపాటు ఆలయ ఉద్యోగులు ఈ చందనాన్ని అరగదీస్తారు.