Sand Mafia in graveyard శ్మశానాన్ని వదలని ఇసుకాసురులు.. అస్తిపంజరాలు బయటపడటంతో భయాందోళనలో ప్రజలు - AP Latest News
🎬 Watch Now: Feature Video
Sand Mafia in graveyard: ఇసుక అక్రమార్కులు సమాధులను సైతం వదలడం లేదు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని స్వర్ణముఖి నదిలో ఇసుకసురుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. నది ఒడ్డున ఉన్న హిందూ శ్మశాన వాటికను సైతం ఇసుక అక్రమార్కులు వదలటం లేదు. చనిపోయిన వ్యక్తులకు తిధులు, సంక్రాంతి నాడు వారి కుటుంబ సభ్యులు సమాధుల వద్ద పూలతో స్మరించుకుంటారు. అయితే ఇటీవల ఇసుక మాఫియా రెచ్చిపోతూ నదిని మొత్తం జల్లెడ పడుతుంది. ఇప్పటికే నదీ గర్భాన్ని డోల్ల చేయగా.. చివరికి ఒడ్డునున్న శ్మశానం వద్ద కూడా తవ్వకాలు చేపడుతుంది. రాత్రి వేళల్లో జేసీబీతో సమాధుల నిర్మాణాలను పక్కకు తోసి.. కిందనున్న ఇసుకను తవ్వుకు పోతున్నారు. దీంతో చాలా సమాధులు ధ్వంసం కాగా.. ఆ ప్రాంతంలో అస్తిపంజరాలు బయటపడటం వల్ల స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ దాటికి ఎవరు ఎక్కడ సమాధి చేసారో తెలియని పరిస్థితి నెలకొంది. యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.