RTC Contract Employees Agitation In Vijayawada: హామీలు నెరవేర్చకుంటే ఉద్యమం తప్పదు: ఆర్టీసీ ఔట్​సోర్సింగ్ ఉద్యోగులు - ఆప్కాస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 16, 2023, 3:08 PM IST

RTC Contract Employees Agitation In Vijayawada: ఏపీఎస్​ఆర్టీసీ కాంట్రాక్టు, ఔట్​సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో ఆర్టీసీ ఒప్పంద ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఔట్​సోర్సింగ్ ఉద్యోగులకు కాంట్రాక్టర్ ద్వారా కాకుండా..  కాంట్రాక్టు, ఔట్​సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి క్రమబద్దీకరించాలన్నారు. ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలని డిమాండ్​ చేశారు. ఎన్నికల సమయంలో ఒప్పంద ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఒప్పంద ఉద్యోగులను ఆప్కాస్​లో చేర్చి ప్రతినెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలన్నారు. ఔట్​సోర్సింగ్ ఉద్యోగులపై కాంట్రాక్టర్​ అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్​ చేశారు. పని ఒత్తిడి తగ్గించి.. ఉద్యోగులకు ఈఎస్ఐ పీఎఫ్ వంటి సదుపాయాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విధుల నుంచి తొలగించిన ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని.. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.