Round Table Meeting on Polavaram Project: "ఆంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షోభంలోకి నెట్టాయి"
🎬 Watch Now: Feature Video
Round Table Meeting on Polavaram Project : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు సంక్షోభంలో (Polavaram Poject in Crisis) పడిందని వ్యవసాయ, నీటి పారుదల రంగ నిపుణులు టి.లక్ష్మీ నారాయణ (Agriculture and water drainage experts T Lakshmi Narayana) ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పురోగతిపై జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో వ్యవహరిస్తున తీరు ప్రభుత్వాల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రీటెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టు పనులు (Status of Polavaram Project) ఆగాయని అన్నారు. నాలుగు సంవత్సరాల్లో కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని, పనులు ఇంకా చేయాల్సి ఉందని గుర్తు చేశారు. ఇప్పుడేమో సీఎం జగన్ 2025కి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్తు, రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం డబ్బులిస్తామని చెబుతున్నారని, ఆఖరి బడ్జెట్ కూడా పూర్తయితే నిధులు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు పోలవరం ప్రాజెక్టుపై స్పందించాలని టి.లక్ష్మీ నారాయణ పిలుపునిచ్చారు.