Check Aadhaar Card Misuse : ప్రస్తుతం నిత్య జీవితంలో ఆధార్ కార్డు భాగమైపోయింది. ప్రభుత్వ సేవలు పొందాలన్నా, బ్యాంకుల్లో ఖాతా తెరవాలన్నా ప్రతి దానికి దీనిని సమర్పించాల్సిందే. ఇలా నిత్యం వినియోగించే డాక్యుమెంట్లలో ఇది కీలకంగా మారిపోయింది. ఎక్కడికి వెళ్లినా దీన్ని వెంట పెట్టుకొని వెళ్తుంటాం. అవసరమున్న ప్రతిచోటా నంబర్ ఇచ్చేస్తుంటాం. దీంతో ఆధార్ కార్డులను ఎక్కడెక్కడ వినియోగిస్తున్నారో తెలియట్లేదు. ఒక్కోసారి మన కార్డు దుర్వినియోగం అయిందా అనే అనుమానం కూడా కలుగుతూ ఉంటుంది. ఈవిషయం తెలుసుకోవాలంటే కార్డ్ హిస్టరీ తెలుసుకోవాలి. దీంతో ఆధార్‌ని అనుమతి లేకుండా ఎవరైనా వినియోగించారో సులువుగా కనిపెట్టేయొచ్చు
ఆన్‌లైన్‌లో సులువుగా హిస్టరీ :
- ఆధార్‌ను ఎక్కడెక్కడ వినియోగించామో తెలుసుకోవడం ముఖ్యం. దీనికోసం ఉడాయ్ పోర్టల్‌కు వెళ్లాలి.
- పైన ఎడమవైపు ఉన్న My Aadhaar ఆప్షన్ కనిపిస్తుంది. అందులో Aadhaar services సెక్షన్‌లో Aadhaar Authentication History ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- అందులో లాగిన్‌పై క్లిక్ చేసి ఆధార్ కార్డు నంబర్, క్యాప్చా, ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
- ఆ తర్వాత కనిపించే స్క్రీన్‌లో కిందకు స్క్రోల్ చేయగానే Authentication History అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
- అక్కడ ALLని ఎంచుకొని డేట్‌ని సెలెక్ట్ చేసుకొని Fetch Authentication History పై క్లిక్ చేయాలి.
- ఆధార్‌కు లింక్ చేసిన ఓటీపీ, బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ ద్వారా మీ ఆధార్ కార్డును ఆరు నెలలుగా ఎక్కడెక్కడ వినియోగించారనే డేటా మొత్తం కనిపిస్తుంది.
ఫిర్యాదు చేయొచ్చు : హిస్టరీలో మీకు తెలియకుండా ఎక్కడైనా ఆధార్ కార్డు వినియోగించారని అనిపిస్తే వెంటనే 1947కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. help@uidai.gov.inకి మెయిల్ చేయవచ్చు. లేదా ఉడాయ్ వెబ్‌సైట్‌లో నేరుగా కంప్లెయింట్ ఇవ్వొచ్చు. ఇకపై అలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఆధార్ కార్డు బయోమెట్రిక్ లాక్ చేయడం ఉత్తమం. దీంతో మీ ప్రమేయం లేకుండా బయోమెట్రిక్‌ని ఉపయోగించేందుకు వీలుండదు. దీన్ని కూడా ఆన్‌లైన్‌లో సులువుగా చేయొచ్చు. ఎలా అంటే
బయోమెట్రిక్ లాక్ :
- బయోమెట్రిక్ లాక్ కోసం ఉడాయ్ పోర్టల్‌లో ఆధార్ కార్డు నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి.
- స్క్రీన్‌పై Lock/Unlock Biometric ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అందులో లాక్/అన్‌లాక్ ఎలా ఉపయోగపడుతుందనే వివరణ ఉంటుంది.
- ఆ పేజీలో కనిపించే Next ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- స్క్రీన్‌పై బయోమెట్రిక్ లాక్/అన్‌లాక్‌కు సంబంధించి రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో Lock Aadhaarని ఎంచుకోవాలి.
- ఆ తర్వాత వర్చువల్ ఐడీ, పూర్తి పేరు, పిన్‌కోడ్, క్యాప్చా, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. అనంతరం Send otp పై క్లిక్ చేయాలి.
- మీ రిజిస్టర్ట్ మొబైల్ నంబర్‌కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి Submit పై క్లిక్ చేయాలి.
ఫ్రీగా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవటం ఎలా?- ఈజీ ప్రాసెస్ ఇదే! - Aadhaar Card Free Update
PVC Aadhar Card Apply : 'ఆధార్' పోయిందా? PVC కార్డ్ కోసం అప్లై చేసుకోండిలా..