Road accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి - Accident news
🎬 Watch Now: Feature Video
Road accident on Duvvur National Highway: నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు వద్ద ఉన్న జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొనగా ముగ్గురు యువకులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు నుండి ఏఎస్ పేట మండలం వైపు వెళ్తున్న మోటార్ సైకిల్.. సిద్దీపురం నుండి బుచ్చిరెడ్డిపాలెం వైపు వస్తున్న మరో మోటార్ సైకిల్‌ను వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందగా మరొక యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో గాయాలైన వ్యక్తిని టోల్ ప్లాజా అంబులెన్స్ ద్వారా వెంటనే బుచ్చిరెడ్డిపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు ఏఎస్‌పేట మండలం చెందులూరుపాడుకు చెందిన లక్ష్మీనారాయణ, మిక్కిలింపేటకు చెందిన మధు, నెల్లూరుకు చెందిన పవన్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై ఆయా గ్రామాలలోని మృతుల కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.