River Front Food Festival In Vijayawada: భోజన ప్రియుల కోసం నది ఒడ్డున ఫుడ్ ఫెస్టివల్
🎬 Watch Now: Feature Video
భోజన ప్రియుల కోసం కృష్ణానది ఒడ్డున భవానీపురం పున్నమి ఘాట్ వద్ద రివర్ ఫ్రంట్ ఫుడ్ ఫెస్టివల్‌ను అధికారులు ప్రారంభించారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేశారు. ఈ పుడ్ ఫెస్టివల్‌ను విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు.
కృష్ణానది ఒడ్డున ఆహ్లాదకరమైన వాతావరణంలో పుడ్ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందన్నారు. నదీ తీరానికి వన్నే తెచ్చే విధంగా విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ ఫుడ్ ఫెస్టివల్లో నగరంలో ప్రసిద్ధి చెందిన నోవోటెల్, ఫార్చ్యూన్ మురళి పార్క్, స్వీట్ మేజిక్, డీవీ మేనర్ వంటి హోటళ్లు భాగస్వామ్యం వహించాయని నగర మేయర్ భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు.
పంజాబీ, రాజస్థాన్, ఢిల్లీ, కేరళ తోపాటు రెండు తెలుగు రాష్ట్రాల సంప్రదాయ వంటకాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ మే 7 తేదీ వరకు రోజూ సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుందన్నారు. ఫుడ్ ఫెస్టివల్‌తో పాటు లైవ్ మ్యూజిక్, స్టాండప్ కామెడీ వంటివి ఏర్పాటు చేశామని, నగర వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు నగర వాసులను అలరించాయి.