ప్రభుత్వ ఉద్యోగులు నిజాయతీగా విధులు నిర్వహిస్తేనే ప్రజాస్వామ్యానికి మనుగడ: విశ్రాంత ఐఏఎస్ అధికారి - బ్యూరోక్రసీ
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 1, 2024, 6:23 PM IST
Retired IAS Officer D Chakrapani: చట్టబద్దమైన ఉత్తర్వులకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులు నిజాయతీగా విధులు నిర్వహించినప్పుడే ప్రజాస్వామ్యానికి మనుగడ అని విశ్రాంత ఐఏఎస్ అధికారి డి. చక్రపాణి అన్నారు. బ్యూరోక్రసీ నాడు - నేడు పేరిట గుంటూరులో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో చక్రపాణి, జనచైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకు కాలానికి అనుగుణంగా వ్యవస్థీకృత మార్పులు, శిక్షణ అందించాలని ఆయన సూచించారు. నిజాయతీగా విధులు నిర్వహించిన వారికి పారదర్శకంగా రివార్డులు అందిస్తే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బ్యూరోక్రసీ కూడా మార్పులను కలిగి ఉండాలన్నారు. సమాజంలోని వ్యక్తులపై చూపించాలంటే, కొన్ని వ్యవస్థీకృతమైన మార్పులు అవసరం అని ఆయన సూచించారు. పాలకులు చట్టబద్దమైనవి కాకుండా వారికి నచ్చినవి చేయమని చెప్పినప్పుడు, వారిని ఎదుర్కునే సామర్థ్యం వారిలో ఉండాలి అని సూచించారు. అందుకు తగిన అవగాహన కూడా ఉండాలన్నారు.