Removal of Illegal Shacks: అనంతపురంలో గుడిసెల తొలగింపు.. అధికారులను అడ్డుకున్న స్థానికులు.. - పామిడి పట్టణం లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Removal of Illegal Shacks: అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని కొండాపురం గేటు వద్ద వేసిన గుడిసెల తొలగింపు చర్యలను అధికారులు చేపట్టారు. తహశీల్దార్ ఆధ్వర్యంలో తొలగింపు చర్యలు చేపట్టిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల జోక్యంతో కాసేపటి తర్వాత గొడవ సద్దుమణిగింది. వివరాల్లోకి వెళ్తే.. వామపక్షాల ఆధ్వర్యంలో గత మూడు నెలల కిందట జిల్లాలోని పామిడి పట్టణంలో కొండాపురం గేటు వద్ద గుడిసెలు వేశారు. దీంతో ఆ గుడిసెలను తొలగించాలంటూ తహశీల్దార్ సునీతా భాయ్ వారికి పలుమార్లు నోటీసులు పంపించారు. అయితే నోటీసులకు వారు స్పందించలేదు. ఫలితంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అధికారులు.. బుధవారం రెవెన్యూ, పోలీసుల సమన్వయంతో ఆ గుడిసెలను తొలగించారు. అయితే గుడిసెల్లో నివసిస్తున్న వారు.. అధికారులను అడ్డుకున్నారు. గుడిసెలు తొలగిస్తే.. తాము ఎక్కడ ఉండాలంటూ.. అధికారులను ప్రశ్నించారు. దీంతో నిజంగా ఇల్లు లేకపోతే వారికి జగనన్న కాలనీలో తహశీల్దార్ ఆధ్వర్యంలో ఇళ్లు ఇప్పిస్తామని పోలీసులు అన్నారు. దీంతో గొడవ సద్దుమణిగింది.