జీవనశైలి, ఆహార అలవాట్లలో మార్పులు అనివార్యం - 'వాటితో' ఆరోగ్యానికి పొంచి ఉన్న ప్రమాదం - ఆరోగ్యకరమైన ఆహారం కలిగే ప్రయోజనాలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-11-2023/640-480-19953887-thumbnail-16x9-regular-physical-activity-for-healthy-life.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 6, 2023, 1:16 PM IST
Regular Physical Activity for Healthy Life: జీవన శైలి, అలవాట్లే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. రోజూ మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని మదనపల్లెకి చెందిన ప్రకృతి వనం పౌండేషన్ వ్యవస్థాపకులు, వ్యవసాయ వేత్త ఎంసీవీ ప్రసాద్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ చందాపురం ప్లైఓవర్ వద్ద వెచన ఆర్గానిక్ వ్యాలి వద్ద ఆదివారం ఆరోగ్యం పై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రసాదు కొన్ని ఆరోగ్య సుత్రాలను పంచుకున్నారు. మట్టి పాత్రల్లో వంట చేయటం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్నారు. పూర్వం వంట చేయడానికి మట్టి పాత్రలు ఉపయోగించే వారని తద్వారా పూర్వీకులు ఆరోగ్యంగా ఉండేవారన్నారు.
Benefits of Walking: జీవితంలో ప్రతి ఒక్కరూ నడకను ఒక భాగంగా చేసుకోవాలని వ్యవసాయ వేత్త ఎమ్‌సీవీ ప్రసాద్ పేర్కొన్నారు. రోజూ అర గంట సేపు నడక వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం మధుమేహం, రక్తపోటు వచ్చాకనే నడక ప్రారంభిస్తున్నారన్నారు. మెదడును ఎప్పుడు ఆలోచనలతో నింపటం వల్ల మెదడు పై బారం పెరుగుతుందని... తద్వారా అనారోగ్యానికి గురవుతారని తెలిపారు. సేంద్రియ ఆహార పదార్థాలతో తయారు చేసిన వంటకాలు ఆరోగ్యదాయమని చెప్పారు. రసాయనాలతో పండించిన ఆహారాలను తీసుకోవద్దన్నారు. ముడిబియ్యం, తృణధ్యానాలు వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలన్నారు. అల్యూమినియం, నాన్‌స్టిక్ వంటి వంట పాత్రలను మానేసి మట్టి పాత్రలు, స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు వినియోగించాలని కోరారు.