రెచ్చిపోయిన స్మగ్లరు.. అడ్డుపడిన పోలీసులు.. కారుతో ఢీకొట్టి పరార్
🎬 Watch Now: Feature Video
Red sandalwood smugglers attack the police: నెల్లూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోబోయిన పోలీసులను కారుతో ఢీకొట్టి పరారయ్యారు. రాపూరు అడవుల నుంచి కారులో ఎర్రచందనం తరలిస్తుండగా పోలీసులు వెంబడించారు. వారికి చిక్కకపోవడంతో తిరుపతి జిల్లా డక్కిలి ఠాణాకు సమాచారమిచ్చారు. వెంటనే అప్రమత్తమైన ఎస్సై నాగరాజు, తన పోలీసు సిబ్బందితో కలిసి తనిఖీలకు బయలుదేరారు. ఈ క్రమంలో ఎర్రచందనం రవాణా చేస్తున్న కారును పోలీసులు అడ్డుకోవడంతో.. ఆగ్రహంతో రగిలిపోయిన స్మగర్లు పోలీసులను, వారి వాహనాలను వేగంగా ఢీకొట్టి, కారును అక్కడే వదిలిపెట్టి పారిపోయారు. ఈ ఘటనలో ఎస్సైకి, పోలీసులకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో ఎర్రచందనం స్మగ్లర్లు హల్‌చల్ చేశారు. కారులో పారిపోతుండంగా స్మగ్లర్లను పట్టుకోబోయిన డక్కిలి ఎస్సై నాగరాజు, పోలీసులపై 6 మంది స్మగ్లర్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎస్సైకి, పోలీసులకు తీవ్రంగా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులు ఆసుపత్రికి తరిలించారు. ముందుగా స్మగ్లర్లను నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో అక్కడి పోలీసులు వెంబడిచారు. దీంతో స్మగ్లర్లు తిరుపతి జిల్లా డక్కిలి మండలం మీదుగా తిరుపతి జాతీయ రహదారిపై వెళ్తుండగా ఉడాయించారు. ఈ విషయాన్ని రాపూరు పోలీసులు డక్కిలి ఎస్సై నాగరాజుకు సమాచారం అందించారు. అప్రమత్తమైన ఎస్సై నాగరాజు, కానిస్టేబుళ్లు సంఘాన పల్లి వద్ద అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కారులో ఉన్న 6 మంది స్మగర్లు దిగి ఎస్సైపై దాడి చేసి, అక్కడే కారును వదిలిపెట్టి అడవుల మీదుగా పరారయ్యారు.