Recording Dance: బ్రహ్మోత్సవాల్లో రికార్డింగ్ డాన్స్.. యువతులతో వైసీపీ నేతల చిందులు - Recording dance in Srikamakshi Devi temple
🎬 Watch Now: Feature Video
బ్రహ్మోత్సవాల్లో యువతులతో కలిసి ఆలయ చైర్మన్, వైసీపీ నాయకులు చిందులు వేసిన ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. సంగంలోని శ్రీ కామాక్షి దేవీ సమేత సంగమేశ్వర ఆలయంలో భక్తిశ్రద్ధలతో బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. అయితే ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఏకాంత సేవ నిర్వహించారు. ఈ ఏకాంత సేవ అనంతరం యువతులచే రికార్డింగ్ డాన్స్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ రికార్డింగ్ డాన్స్‌లో యువతులతో కలిసి ఆలయ కమిటీ చైర్మెన్ పెరుమాళ్లా రవీంద్ర బాబు, వైసీపీ నాయకులు కొందరు కలిసి ఇష్టం వచ్చినట్లుగా చిందులు వేశారు. దేవాలయ ప్రాంగణంలో రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేయడం.. వారితో అధికారులే ఇలా చిందులు వేయడం వల్ల బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులకు నచ్చకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఆలయాల్లో ఇలా రికార్డింగ్ డాన్స్‌లు నిర్వహిస్తుంటే పోలీసులు పట్టించుకోవటం లేదని పలు విమర్శలు వినిపిస్తున్నాయి.