Guntur Municipal Council meeting గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాల్లో కొనసాగుతున్న గందరగోళం.. - గుంటూరు జిల్లా లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Guntur Municipal Council meeting: అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం సభ్యుల వాగ్వాదంతో.. గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం నేడు కూడా రసాభాసగా మారింది. ఎన్టీఆర్ సర్కిల్‌ను అభివృద్ధి చేయాలని తెలుగుదేశం కార్పొరేటర్లు పట్టుబట్టారు. కులాలు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని వైసీపీ కార్పొరేటర్లు వాదనలకు దిగారు. నియోజకవర్గ పరిధిలో ఎన్టీఆర్ సర్కిల్‌ను తానే అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే ముస్తఫా చెప్పగా.. అసత్యాలు చెప్పొద్దంటూ ఆయనతో తెలుగుదేశం కార్పొరేటర్లు వాగ్వాదానికి దిగారు. కౌన్సిల్ హాల్‌లో బైఠాయించి టీడీపీ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. 9 లక్షల రూపాయలు విడుదల చేసినా.. కాంట్రాక్టర్ పనులు చేయలేదంటూ.. కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే ముస్తఫా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా తాను అడిగినా.. లక్ష రూపాయలతో కల్వర్టు నిర్మాణం చేయలేదని అసహనం వెళ్లగక్కారు. రెండున్నరేళ్లు వేచి చూసినా ఎలాంటి ఫలితం లేదన్నారు. ఏఈ ని కౌన్సిల్‌కు పిలిపించాలని ఎమ్మెల్యే ముస్తఫా డిమాండ్ చేశారు. ఏఈ వచ్చే వరకూ కౌన్సిల్ సమావేశం నిలిపివేయాలన్నారు. వైసీపీ, టీడీపీ కార్పొరేటర్ల పరస్పర వాగ్వాదాలు, ఎమ్మెల్యే అసంతృప్తి మధ్య గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం గందరగోళంగా సాగింది.
TAGGED:
Guntur district latest news