సీఎం జగన్ లక్షా 65వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు - పులివెందుల పీఎస్లో రామచంద్ర యాదవ్ ఫిర్యాదు
🎬 Watch Now: Feature Video
Ramachandra Yadav Complaint on CM Jagan Corruption: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తులు, అవినీతిపై.. భారతీయ చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర యాదవ్ పులివెందుల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం నాలుగున్నరేళ్లలో సీఎం జగన్.. వేల కోట్ల రూపాయల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, తక్షణమే కేసు నమోదు చేసి, విచారణ చేపట్టాలని ఎస్సై ఉసేన్‌ను కోరారు.
Ramachandra Yadav Comments: ''2019 అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నుంచి వైఎస్ జగన్ గెలిచారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నియోజకవర్గానికి గానీ, రాష్ట్రానికి గానీ చేసింది ఏమీ లేదు. ఈ నాలుగున్నరేళ్లలో జగన్ రాష్ట్రాన్ని లూటీ చేశారు. మద్యం, ఇసుక, నీటి ప్రాజెక్టుల పేరుతో సుమారు లక్షా 65వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. జగన్ అవినీతిపై ఈరోజు పులివెందుల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. జగన్ రెడ్డి అవినీతి, అక్రమాలపై ఎక్కడైనా బహిరంగంగా చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనల వల్ల పులివెందులకు చెడ్డ పేరు వస్తోంది. ఏపీలో పరిస్థితి ఎలా ఉందంటే.. జగన్‌కు అడ్డు వస్తే హత్యలు కూడా చేయిస్తున్నారు. సొంత చెల్లి, తల్లి పక్క రాష్ట్రంలో తలు దాచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కొట్టడానికి వెనుకాడని దుర్మార్గుడు ఈ జగన్. జగన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే అతను అవినీతి చేయలేదని ఏ చర్చిలోనైనా ప్రమాణం చేయమని చెప్పండి. అతను ప్రమాణం చేస్తే.. నేను రాజకీయాల నుంచి వైదొలగి, జగన్‌కు మద్దతు ఇస్తా'' అని రామచంద్ర యాదవ్ సవాల్ విసిరారు.