ఎట్టకేలకు మెుదలైన సబ్వే నిర్మాణపనులు - మరింత సులువుగా 14 గ్రామాల రాకపోకలు - news on vishaka trains
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 23, 2023, 10:14 PM IST
Railway Department constructed a large subway: విశాఖలోని వాల్తేర్ రైల్వే డివిజన్ పరిధిలో సబ్ వే నిర్మాణానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. సింహాచలం రైల్వే స్టేషన్ సమీపంలో 9 కోట్ల వ్యయంతో ఈరోజు ఉదయం సబ్ వే నిర్మాణం మొదలైంది. ప్రయాణికులకు గాని సరుకు రవాణా కు గాని ఎలాంటి ఆటంకం కలగకుండా కేవలం 12 గంటల్లో ట్రాక్ నిర్మాణ పనులు పూర్తి చేయనున్నట్లు వాల్తేర్ డిఆర్ఎం సౌరబ్ ప్రసాద్ తెలిపారు. తద్వారా చంద్రానగర్, కొత్తపాలెం గ్రామాలతోసహా 14 గ్రామాలకు రాకపోకలు ఇకపై సులభం అవుతాయని ఆయన తెలిపారు. స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టులకు వెళ్లే గూడ్స్ రైల్స్ తోపాటు ఇతర ఎక్స్ప్రెస్, సాధారణ ప్యాసింజర్ రైళ్లు వెళ్లే ఆరు లైన్ల ట్రాక్ కింద ఈ సబ్ వే నిర్మాణం చేపట్టామని డిఆర్ఎం తెలిపారు. దీనివల్ల లెవెల్ క్రాసింగ్ గేట్ల వాహనాల రాకపోకల జాప్యం తగ్గుతుందని తెలిపారు.
ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పర్యటనలో జరిగిన సమీక్ష మేరకు సబ్ వే నిర్మాణం పనులు చేపట్టామని వెల్లడించారు. సబ్ వే నిర్మాణం కోసం 2020లో ప్రతిపాదనలు పంపించినట్లు డిఆర్ఎం తెలిపారు. కేంద్ర మంత్రి చొరవతో ఈ ప్రాజెక్టును త్వరితగతిన చేపట్టినట్లు వెల్లడించారు. ఇటీవలే కంటకాపల్లిలో కూడ సబ్ వే నిర్మాణం విజయవంతంగా పూర్తి చేసినట్లు సౌరబ్ ప్రసాద్ తెలిపారు.