RAILWAY BOGI FIRE: ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం - రైల్వే బోగీలో అగ్ని ప్రమాదం
🎬 Watch Now: Feature Video
RAILWAY BOGI FIRE: ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్లో ఏసీ రైల్వే భోగీలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే లైన్ మరమ్మతుల కోసం ప్రత్యేకంగా ఉపయోగించే క్యాంపింగ్ కోచ్ ఫర్ ట్రాక్ మెషిన్ స్టాఫ్ ప్రయాణించే రైలు బోగీలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన మరమ్మతు విభాగ సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. హూటాహుటిన అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం జనరేటర్ వద్ద షార్ట్ సర్క్యూట్ అయిందని, సిబ్బంది కూర్చునే సీట్లు, భోగి ఎదురు భాగం పూర్తిగా కాలిపోయిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.. ఈ రైలు బోగీల పెద్ద మొత్తంలో డీజిల్‌తో నిండి ఉన్నాయి. పెద్ద ప్రమాదం తప్పడంతో రైల్వే సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మెకానిక్ సిబ్బంది ఉండే భోగి ప్రమాదానికి గురైంది. జనరేటర్ వద్ద షార్ట్ సర్క్యూట్ కావటం వల్ల మంటలు వ్యాపించాయి. అందులో డీజిల్ బ్యారెల్స్ ఉండటం వల్ల ఏసీ భోగీలోకి, సిబ్బంది కూర్చునే సీట్లు దగ్ధమయ్యాయి. ఇందులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.- రామకృష్ణ, అగ్నిమాపక సిబ్బంది