Ragging Incident in Guntur Medical College: గుంటూరు వైద్య కళాశాలలో ర్యాగింగ్.. జాతీయ మెడికల్ కమిషన్‌కు విద్యార్థుల ఫిర్యాదు.. - సీనియర్లు వేధించారని మెడికల్ విద్యార్థుల ఫిర్యాదు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 30, 2023, 3:48 PM IST
Ragging Incident in Guntur Medical College: ర్యాగింగ్‌ను నివారించటానికి ప్రభుత్వాలు, విద్యాసంస్థల వంటివి ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎక్కడోచోట ర్యాగింగ్ ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. విద్యార్థుల జీవితాల్లోకి అడుగిడుతున్నా ర్యాగింగ్ భూతం.. బాధితులుగా మారుస్తోంది. తాజాగా గుంటూరులో జూనియర్ విద్యార్థులను.. సీనియర్ విద్యార్థులు వేధించారని ఫిర్యాదు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే.. గుంటూరు వైద్య కళాశాలలో ర్యాగింగ్ ఘటన కలకలం సృష్టించింది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి.. సీనియర్లు వేధించారని కాలేజి ప్రిన్సిపల్‌తో పాటు జాతీయ మెడికల్ కమిషన్‌కు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. గతేడాది కూడా కాలేజిలో జూనియర్ విద్యార్థిపై సీనియర్ ర్యాగింగ్ చేయగా ఇలాగే ఫిర్యాదు వెళ్లింది. మెడికల్ కమిషన్ నుంచి వచ్చిన ఆదేశాలతో విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. మళ్లీ ఈ ఏడాది కూడా ర్యాగింగ్ పునరావృతమైంది. మొదటి సంవత్సరం విద్యార్థులకు నెల రోజుల క్రితమే తరగతులు మొదలయ్యాయి. ఈ లోపే ర్యాగింగ్ ఘటన చోటు చేసుకోవటం విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రతి సంవత్సరం ఇలా ర్యాగింగ్ ఘటనలు వెలుగులోకి వస్తుండటం కలకలం సృష్టిస్తోంది.