PROTEST TO MLA RAVINDRANATH REDDY: ఆ ఎమ్మెల్యేకు అదే తరహాలో మరోమారు నిరసన సెగ - RAVINDRANATH REDDY IN GADAPA GADAPAKU
🎬 Watch Now: Feature Video
PROTEST TO MLA RAVINDRANATH REDDY IN DEVARAJUPALLI : వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత కొద్ది రోజులుగా 'గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం' నిర్వహిస్తోంది. కానీ ప్రజా ప్రతినిధులకు నిరసనలు సర్వసాధారణం అయ్యాయి. వైఎస్సార్ జిల్లాలో మాత్రం గ్రామస్థులు సరి కొత్తగా తమ అభిమతం తెలిపారు. గ్రామస్థుల నిరసనతో ఒక్కసారిగా షాక్ అయిన ఆ ఎమ్మెల్యే ప్రజలు లేకపోయినా, కెమెరాల ఎదుట 'గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం' కొనసాగించారు. అనంతరం అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. గతంలో కూడా ఆ ఎమ్మెల్యేకు ఇదే తరహాలో గట్టిగానే తమ నిరసనను తెలిపారు.
వైయస్సార్ జిల్లా కమలాపురం మండలం దేవరాజుపల్లి పంచాయతీలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి నిరసన సెగ గట్టిగానే తగిలింది. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మంగళవారం 'గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం'లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గ్రామంలోని కొంత మంది ఇళ్లపై టీడీపీ జెండాలు ఏర్పాటు చేసి తమ నిరసనను తెలియజేశారు. అంతేకాక చిన్న పుత్త జీవంపేట సముద్రం పల్లెలో ఇంటిపై టీడీపీ జెండాలు ఏర్పాటు చేశారు. తమ కుటుంబ సభ్యులందరూ ఎవరూ లేకుండా వారి ఇళ్లకు తాళాలు వేసి మరీ నిరసన తెలిపారు. గ్రామంలో ఎవ్వరూ లేనప్పటికీ తగ్గేదేలే అంటూ రవీంద్రనాథ్ రెడ్డి కాలనీ మొత్తం తిరిగారు. దేవరాజు పల్లి గ్రామానికి టీడీపీ ఇంచార్జ్ పుత్తా నరసింహా రెడ్డి స్వగ్రామానికి కూతవేటు దూరంలో ఉండటంతో పోలీసు బలగాలతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.