Protest Aganist Minister Vishwaroop Son Srikanth: గడపగడపలో మంత్రి విశ్వరూప్‌ కుమారుణ్ని నిలదీసిన స్థానికులు.. పక్కకు తీసుకెళ్లిన అధికారులు - Protest Aganist Minister Vishwaroop Son Srikanth

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 31, 2023, 4:35 PM IST

Gadapagadapaku Mana Prabhutvam Programme: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో అధికార పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు వారి కుమారులకు తిప్పలు తప్పటం లేదు. ఓట్లేసి గెలిపించినందుకు నాలుగేళ్ల కాలంలో గ్రామాభివృద్ధికి ఏం చేశారంటూ స్థానికులు నిలదీస్తున్నారు. తాజాగా మంత్రి విశ్వరూప్‌ కుమారుడు శ్రీకాంత్‌.. కోనసీమ జిల్లా అమలాపురం మండలం కామనగరువులో గడపగడపకు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆయనకు అడుగడుగునా స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. గ్రామంలోకి ఎందుకొచ్చారంటూ ఆయనను స్థానికులు ప్రశ్నించారు. 

ఈ సందర్భంగా స్థానికులు శ్రీకాంత్​తో మాట్లాడుతూ.. అమలాపురం అల్లర్ల కేసులో అన్యాయంగా ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయంగా 3 నెలలు జైలులో పెట్టించారంటూ మండిపడ్డారు. 'మీ ఇంటి దహనాలతో మాకేం సంబంధం' అంటూ నిలదీశారు. కేసులు పెట్టి.. గ్రామంలోకి ఎందుకొచ్చారంటూ విశ్వరూప్‌ కుమారుణ్ని స్థానికులు ప్రశ్నించారు. దాంతో తాను ప్రభుత్వ కార్యక్రమాలు వివరించేందుకు వచ్చానని.. శ్రీకాంత్‌ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. స్థానికులు తీవ్రంగా ఆగ్రహించారు. పరిస్థితిని గమనించిన అధికారులు.. విశ్వరూప్‌ కుమారుడిని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.