Protest against former MLA: వైసీపీ నేతలకు గడపగడపలో నిరసన.. అభివృద్ధి ఎక్కడంటూ వాహనాన్ని అడ్డుకున్న మహిళలు - Former MLA Visvesvara Reddy deposed women
🎬 Watch Now: Feature Video
Protests in Gadapagadapa program: వైసీపీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. గ్రామాల్లో తలెత్తుతున్న సమస్యలపై నాయకులను నిలదీస్తున్నారు. దీంతో ప్రతీ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలకు ఎదురుగాలి తప్పడం లేదు. సమస్యలు పరిష్కరించాకే ఊర్లోకి అడుగుపెట్టాలంటూ జనాలు అడ్డుకుంటున్నారు. తాజాగా అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పాల్తూరులో గడపగడప కార్యక్రమానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డికీ చేదు అనుభవం ఎదురైంది. మంచినీటి సమస్యతో ఇబ్బందిపడుతున్నామన్న ప్రజలు.. కిలోమీటర్ల మేర నడిచి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ గుంతల రోడ్లు ఉన్నాయని.. సమస్యలపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చెసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహంతో.. వైసీపీ నేత కారును మహిళలు అడ్డుకున్నారు. గ్రామానికి వచ్చిన ప్రతీసారి సమస్య పరిష్కరిస్తామని ఏదో ఒకటి చెప్పి వెళ్లిపోతున్నారంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ చాలా సేపు ఉధ్రిక్తత వాతావరణం నెలకొంది. మహిళల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. వాహనం దిగకుండానే విశ్వేశ్వరరెడ్డి అక్కడ నుంచి జారుకున్నారు.