ETV Bharat / state

మెసేజ్‌లు పంపుతున్నాడని కుడిచెయ్యి నరికేశారు - వీడిన మర్డర్ మిస్టరీ! - YOUNG MANS RIGHT HAND CHOPPED

కుడి చెయ్యిని పదునైన కత్తితో సగానికి నరికి దూరంగా విసిరేసిన ప్రియురాలి భర్త, మరో ఇద్దరు - ఎవరూ గమనించకపోవడంతో చెయ్యి నుంచి తీవ్ర రక్తస్రావమై మృతి!

Young Mans Right Hand Was Cut Off Due To Sending Messages
Young Mans Right Hand Was Cut Off Due To Sending Messages (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 18, 2025, 5:53 PM IST

Young Mans Right Hand Was Cut Off Due To Sending Messages : ఏలూరు జిల్లా నిడమర్రు మండలానికి చెందిన మజ్జి ఏసురాజు(26) హత్య కేసు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. వివాహేతర సంబంధమే ఆ యువకుడిని బలిగొంది. ప్రియురాలి భర్త, మామలే ఏసు రాజును హతమార్చినట్లు సమాచారం. వీరికి గణపవరానికి చెందిన మరో వ్యక్తి సహకరించినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ అయినట్లు తెలిసింది. కనిపించకుండాపోయిన మృతుడి కుడి చెయ్యి భాగాన్ని పోలీసులు సోమవారం కనుగొన్నారు. తన భార్యతో వివాహేతర సంబంధం వద్దని ఆమె భర్త ఏసురాజుకు ఎన్నోసార్లు చెప్పాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఉండి మండలంలోని ఓ గ్రామంలో అత్తింట్లో తన భార్యతో ఏసురాజు ఉండటంతో అతను తట్టుకోలేకపోయాడు.

పదునైన కత్తితో సగానికి నరికి : అనంతరం తన తండ్రికి సమాచారమిచ్చాడు. తరువాత మరో వ్యక్తి సహాయంతో ఏసురాజును బావాయిపాలెం తీసుకొచ్చారు. ఆమెకు మెసేజ్‌లు పంపుతున్న ఏసురాజు కుడి చెయ్యిని పదునైన కత్తితో సగానికి నరికి దూరంగా విసిరేశారు. అనంతరం ఏసురాజును కాపవరం పంట కాలువ రేవులో పడేసి ముగ్గురు పరారయ్యారు. ఏసురాజును ఎవరూ గమనించకపోవడంతో చెయ్యి నుంచి తీవ్ర రక్తస్రావమై మృతి చెందినట్లు తెలుస్తోంది. నిందితులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

వివాహేతర సంబంధం అనుమానంతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ హత్య

తండ్రీకూతుళ్ల హత్య- 5నెలలగా ఇంట్లోనే మృతదేహాలు! వాసన రాకుండా AC ఆన్​ చేసి మరీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.