Workers Of Drinking Water Strike In Ananthapur District: ఉమ్మడి అనంతపురం జిల్లాలో 850 గ్రామాలకు అర్దరాత్రి నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులకు పది నెలలుగా వేతనాలు, ముప్పై నెలల ఈపీఎఫ్ సొమ్మును జమచేయకపోవడంతో కార్మికులు సమ్మెబాట పట్టారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం నిర్వహణను భ్రష్ఠు పట్టించడంతో కార్మికుల వేతనాల బకాయి పడ్డాయి. గత ఐదేళ్లపాటు ఏడాదికి మూడు సార్లు సమ్మె చేసి వేతనాలు పొందారు.
తాగు నీటి పథకాల కార్మికుల సమ్మె బాట: తన బకాయిలు, పథకం నిర్వహణ సంబంధించి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుకోవడానికి కూటమి ప్రభుత్వానికి సాధ్యం కాక కార్మికుల సమస్యలు పరిష్కారం కావడంలేదు. దీంతో గత ఏడాది అక్టోబర్ నుంచి వేతన బకాయిలపై అధికారులను హెచ్చరికలు చేస్తూ వచ్చిన కార్మికులు, ఎలాంటి స్పందన లేకపోవడంతో అర్దారాత్రి నుంచి నీటి పంపులను నిలిపివేసి సమ్మె ప్రకటించారు. ఫలితంగా కార్మికుల సమ్మె కారణంగా అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో 850 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది.
వేతన బకాయిలను చెల్లించాలని డిమాండ్: పలుచోట్ల పంప్ హౌస్ల వద్ద ట్యాంకుల్లో నీరు నిల్వ ఉన్న కార్మికులు సరఫరా చేయరు. దీంతో ఈ పథకంలో తాగునీటిని అందించే అన్ని గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రభుత్వం కార్మికుల వేతన బకాయిలను విడుదల చేసి, గత ప్రభుత్వంలో తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలన్నింటినీ వెనక్కు తీసుకోవాలని కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఉరవకొండలో కొనసాగుతున్న దాహం కేకలు -కూటమి సర్కారుపైనే ఆశలు - Water Problem in Uravakonda
మున్నేరు వరద మిగిల్చిన నష్టం - 50 గ్రామాలకు నిలిచిన తాగునీటి సరఫరా - Drinking Water Schemes Damage