Priest Locked to Temple: 7నెెలలుగా అందని జీతం.. ఆలయానికి పూజారి తాళం - గుడికి తాళం
🎬 Watch Now: Feature Video
Priest Locked to Temple for Salary: అనంతపురం జిల్లాలో పూజారి వినూత్న నిరసనకు దిగాడు. తనకు వేతనం అందటం లేదని ఏకంగా గుడి తలుపులకే తాళం వేసి తన ఆవేదనను వ్యక్తపరిచారు. కంబదూరు మండలంలోని కమలం మల్లీశ్వర ఆలయంలో సేవలు నిర్వహిస్తున్న పూజారి సోమవారం తాళం వేసి తన నిరసన తెలిపారు. తాళం వేసి ఉండటంతో ఆలయానికి వచ్చిన భక్తులు వెనుదిరిగారు. ఈ ఆలయం పురావస్తు శాఖ అధీనంలో ఉండగా.. దేవదాయ శాఖకు చెందిన ఓ ఆధికారే ప్రభుత్వం దూపదీప నైవేద్యాల కింద అందించే వేతనాన్ని తీసుకుంటున్నాడని అర్చకుడు ఆరోపిస్తున్నాడు. తన వేతనాన్ని మాత్రమే కాకుండా ఆ ప్రాంతంలోని దాదాపు తొమ్మిది మంది పూజారుల వేతనాలను స్వాహా చేస్తున్నాడన్నాడు. ఆలయంలో సేవలు అందిస్తున్న తనకు గత 7 నెలల నుంచి వేతనం ఇవ్వలేదని అర్చకుడు మంజూనాథ్ తెలిపారు. తనకు ఇచ్చే నామమాత్రపు వేతనం కూడా ఇవ్వటంలేదని.. సోమవారం గర్భాలయ తలుపులు మూసి పూజారి తాళం వేశారు. ఇచ్చే నామమాత్రపు వేతనం కూడా ఇవ్వటం లేదని.. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు.