Prathidwani వాలంటీర్ల వ్యవస్థ ఎందుకింత వివాదాస్పదం అవుతోంది - volunteers are Nothing but Spy Systems for YCP
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17170787-217-17170787-1670687500582.jpg)
జగన్ ప్రభుత్వం తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం నాటిన వాలంటీర్ వ్యవస్థ.. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా రాష్ట్రం మొత్తం వేళ్లూనుకుంది. వైసీపీ కోసం పెంచి పోషిస్తున్న ఈ సమాంతర వ్యవస్థ.. ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడుతోంది. ప్రజాస్వామ్యానికే పెను సవాల్‌గా మారింది. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన.. స్వేచ్ఛగా జీవించే హక్కుకి, భావ ప్రకటన స్వేచ్ఛకు పెను విఘాతంగా మారింది. పింఛన్లు వంటి ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు సక్రమంగా అందేలా చూసేందుకే వాలంటీర్లను నియమించామని ప్రభుత్వం చెబుతోంది. అయితే..వాలంటీర్ల నియామకం వెనుకున్న అసలు ఉద్దేశం వేరే..! వారు సేవ చేస్తోంది ప్రజలకు కాదు..అధికార పార్టీకే. వారు చేస్తోంది పూర్తిగా రాజకీయ కార్యకలాపాలే! ప్రజలపైనా, ప్రతిపక్షాలపైనా నిఘా పెట్టడం, వారి బలాల్ని, బలహీనతల్ని కూపీలాగి అధికార పార్టీకి చేరవేయడమే వారి ప్రధాన విధిగా మారిన తరుణంలో.. ఇదే అంశంపై ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST