Prathidwani: ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు ఎన్నటికి పూర్తయ్యేను? - AP Latest News
🎬 Watch Now: Feature Video
Prathidwani: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది? రాష్ట్ర ప్రజలకు ఇదో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లుగా ఆ బహుళార్థ సాధక ప్రాజెక్టుపై అనుసరిస్తున్న వైఖరే ఈ ప్రశ్నలకు కారణం. ఇప్పటికే చాలాసార్లు గడువులు మారిపోయాయి. వారి ప్రభుత్వం వచ్చిన కొత్తలో 2021 డిసెంబర్ అన్నారు.. తర్వాత 2022 జూన్ అన్నారు.. ఆపై 2023 అన్నారు.. ఇప్పుడు 2025 జూన్ అంటున్నారు. దీనికి కొంచెం ముందు జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ఎప్పటికి పూర్తి చేస్తామో చెప్పలేమన్నారు. అసలు వీటన్నింటిని ఏం అనుకోవాలి? రాష్ట్ర జీవనాడి పోలవరం పూర్తిపైనే ఎందుకిన్ని పిల్లిమొగ్గలు? అసలు పోలవరం సాకరమయ్యేది ఎప్పటికి? అసలు 45.72 మీటర్ల ఎత్తుతో తలపెట్టిన పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్లు.. తొలిదశ, ఇవన్నీ ఎందుకు తెరపైకి వస్తున్నాయి? అనుకున్న లక్ష్యం మేరకే ప్రాజెక్టు నిర్మాణం సాగుతోందా? పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏమిటి? ఇలా గడువు మీద గడువు పెంచుకుంటూ.. పోతే.. రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరుగుతుంది? పెరిగే వ్యయం మాటేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.