Prathidwani: సీఎం జగన్ చెబుతున్నట్లు సీపీఎస్ రద్దు చేయటం అసాధ్యమా?
🎬 Watch Now: Feature Video
Prathidwani : అధికారంలోకి వస్తే వారంలోనే సీపీఎస్ రద్దు చేస్తాం అన్నారు. ఇప్పుడు అధికారం ఆరు నెలలు ఉన్న సమయంలో సీపీఎస్ బదులు జీపీఎస్ అంటున్నారు. ఉద్యోగస్తులతో చర్చించకుండానే జీపీఎస్ ఆర్డినెన్స్ తెస్తామంటున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అసలు జీపీఎస్‌కు సంబంధించి దేశానికే ఆదర్శం అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై సీపీఎస్ ఉద్యోగ సంఘాలు అన్ని తీవ్రంగా మండిపడుతున్నాయి. బకాయి ఉన్న 2 డీఏల్లో ఒకటి ఇవ్వడం, వైద్య ఆరోగ్య శాఖలో మహిళ ఉద్యోగులకు 5 రోజుల అదనపు సెలవుల ప్రకటనతో ఉద్యోగుల సమస్యలన్నీ తీరిపోయినట్లేనా? సీపీఎస్ సమస్యపై మనసు పెట్టి నిజాయతీగా పని చేశామని కూడా అన్నారు సీఎం జగన్. సీపీఎస్ నుంచి జీపీఎస్ వరకు జరిగిన పరిణామాల్ని చూస్తే మీకు ఏమనిపించింది? సీఎం జగన్ చెబుతున్నట్లు సీపీఎస్ రద్దు చేయటం అసాధ్యమా? దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అలాంటి ప్రయత్నం జరగలేదా? రాష్ట్రంలో సగటు పెన్షనర్ పరిస్థితి ఏమిటి? మొత్తం వారి సంఖ్య ఎంత ఉండొచ్చు? పెన్షనర్లకు ఈ నాలుగున్నరేళ్లలో ఎంత పెన్షన్ పెంచారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని..