Prathidwani: ఇప్పటికీ డోలీలను నమ్ముకుంటున్న అడవిబిడ్డలకు.. జగనన్న ఏం చేశారు? - ఏపీలో గిరిజన సంక్షేమ పథకాలు
🎬 Watch Now: Feature Video
Tribals problems: జగన్మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో గిరిజనులకు ఏం ఒరిగింది? ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ మ్యానిఫెస్టోలో వైఎస్ జగన్ గిరిజనులకు ఇచ్చిన హామీలు ఏమిటి? నాలుగేళ్లలో వాటిల్లో ఎన్ని నెరవేర్చారు? ఎస్టీ సబ్‌ప్లాన్ పారదర్శక అమలు నుంచి మొదలు.. గిరిజనుల కోసం అనేక హామీలు ఇచ్చిన జగన్మోహన్‌రెడ్డి.. కొత్తగా తెచ్చిన పథకాలు దేవుడెరుగు.. గిరిజనులకు గతంలో ఉన్న పథకాలన్నీ ఏమై పోయాయి? ఇవేవో విపక్షాల ప్రశ్నలు కాదు. రాష్ట్రంలో గిరిజనుల ప్రాంతాల్లో భూముల అన్యాక్రాంతం, ఆక్రమణల విషయంలో కూడా కొంతకాలంగా ఉద్యమాలు, ఆందోళనలు జరుగుతున్నాయి కారణం ఏమిటి? మరి గతంలో వారికి అందిన 18 సంక్షేమ పథకాలు ఏమైపోయాయి? ఈ రోజుకీ కనీసం రోడ్లు లేక.. రవాణ సదుపాయాలు లేక.. అత్యవసర వైద్య సేవలు అందక అడవిబిడ్డలు ప్రాణాలు కోల్పోవాల్సిన దైన్యం ఎందుకు? ఇప్పటికీ డోలీలను నమ్ముకోవాల్సిన దుస్థితి ఎందుకు? ప్రశ్నించే వారిని అణచివేస్తున్నారని ఆందోళనలు చేస్తున్నారు. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.