కౌలు రైతుల కన్నీరు కనిపించడం లేదా - ఎందుకీ నిర్లక్ష్యం?
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 1, 2023, 9:24 PM IST
Prathidwani: కౌలు రైతులకు వడ్డీ లేని రుణాలు, సీసీఆర్సీ కార్డులతో వాళ్ల స్థితిగతులు మార్చుతామంటూ గొప్పలు చెప్పిన జగన్ గడిచిన నాలుగున్నరేళ్లుగా వాళ్లకు చేసిందేంటి? దిక్కుతోచని స్థితిలో ఉరి కొయ్యలకు వేలాడుతున్న అభాగ్యుల వ్యథలే అందుకు సాక్ష్యం అంటున్నాయి పరిస్థితులు. తలకు మించిన భారంగా మారిన అప్పులు, వడ్డీలు ఆ అభాగ్యుల ఉసురు తీస్తున్నాయి. మాటలు - చేతలకు పొంతనలేని జగన్ సర్కారు నిర్వాకాలను నిలదీస్తున్నాయి.
ప్రభుత్వం నుంచి కనీసం 10% మంది కౌలురైతులు కూడా ఎలాంటి గుర్తింపు, పథకాల సాయానికి నోచుకోవడం లేదన్న గణాంకాలూ వారి వ్యథలను అందరి కళ్లకు కడుతున్నాయి. ఆర్బీకేల్లో సాయం, ఈ-క్రాప్ నమోదు వాటన్నింటికీ రైతు పేరిట హక్కు పత్రాలు తప్పనిసరి. కానీ అవేవీ లేని కౌలురైతులు విత్తు నుంచి పంట అమ్ముకునే వరకు ఎదురవుతున్న కష్టాలేంటి ? అసలు జగన్ ప్రభుత్వం కౌలు రైతుల విషయంలో ఏం చెప్పింది ? ఏం చేస్తోంది ? ప్రతిపక్షంలో ఉండగా జగన్ కౌలు రైతులకు పలు హామీలిచ్చారు ? నాలుగున్నరేళ్లుగా ఏం చేస్తున్నారు ? దానివల్ల వారి జీవితాలెలా తలకిందలయ్యాయి ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.