PRATHIDWANI మీడియా చర్చల ధోరణులపై ప్రభుత్వం మౌనమెందుకు - SC on media discussions
🎬 Watch Now: Feature Video
Prathidwani: ఈ దేశం ఎటు పోతోంది? మీడియా చర్చల ధోరణులపై దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యక్తం చేసిన ఆవేదన ఇది. సమాజంలోని ప్రతి అంచెను విషపూరితం చేసే విద్వేషాల్ని వెదజల్లడానికి ఆస్కారం ఇవ్వొద్దు. అలాంటి శక్తులకు అసలు అవకాశం ఎందుకు ఇస్తున్నారు? సూటిగా ఇవే ప్రశ్నలు సంధించింది సుప్రీం. ఇటీవల అనేక సందర్భాల్లో... దేశవ్యాప్తంగా మాటలే మంటలు రేపుతున్న ఘటనలు పెరుగుతున్న తరుణంలో మీడియాను ఉద్ధేశించి ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం. ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు ప్రేక్షకపాత్రకే పరిమితం అవుతోందని ప్రశ్నించింది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? విజ్ఞత, బాధ్యత గుర్తెరిగి ఉండాల్సిన చోట ఎందుకు విమర్శలు మూటగట్టుకోవాల్సి వస్తోంది? దిద్దుబాటకు ఏం చేస్తే మేలు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST